Share News

Minister Lokesh: నెలాఖరులోగా గూగుల్‌కు శంకుస్థాపన

ABN , Publish Date - Nov 14 , 2025 | 05:18 AM

గూగుల్‌ డేటా సెంటర్‌కు విశాఖపట్నంలో ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ప్రకటించారు.

Minister Lokesh: నెలాఖరులోగా గూగుల్‌కు శంకుస్థాపన

  • త్వరలోనే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ కార్యకలాపాలు.. ఇన్ఫోసిస్‌ మరింత విస్తరణ

  • ఏపీని ‘కాలిఫోర్నియా ఆఫ్‌ ఈస్ట్‌’గా తీర్చిదిద్దుతాం: లోకేశ్‌

  • ఎండాడ, రుషికొండల్లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, ఐటీ కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపన

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): గూగుల్‌ డేటా సెంటర్‌కు విశాఖపట్నంలో ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి గురువారం విశాఖ వచ్చిన ఆయన.. ఎండాడలోని పనోరమ హిల్స్‌ వెనుక వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (కపిల్‌ చిట్స్‌ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేటు లిమిటెడ్‌)కు, రుషికొండపై ఫినోమ్‌ పీపుల్స్‌ లిమిటెడ్‌, సెయిల్స్‌ సాఫ్ట్‌వేర్‌, ఐ స్పేస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, టెక్‌ తమ్మిన సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో త్వరలోనే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. ఇన్ఫోసిస్‌ మరింత విస్తరణకు వెళ్తుందని... ఇవి కాకుండా మరిన్ని ఐటీ సంస్థలు రాబోతున్నాయని చెప్పారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే మూడేళ్లలో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ‘కాలిఫోర్నియా ఆఫ్‌ ఈస్ట్‌’గా తీర్చిదిద్దుతామని.. ఈ ప్రయాణంలో అంతా భాగస్వా మ్యులు కావాలని పిలుపిచ్చారు. ఫినోమ్‌ సహవ్యవ స్థాపకుడు హరి బైరెడ్డి మాట్లాడుతూ.. రెండు దశల్లో విస్తరణ పనులు చేపడతామనిరూ.207.5 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

విశాఖకు టిల్‌మాన్‌ డేటా సెంటర్‌.. టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ రూ.15000 కోట్లతో 250-300 మెగావాట్ల సామర్థ్యంలో విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటుకు ముందుకొచ్చింది. 40 ఎకరాల్లో స్థాపించే ఈ డేటా సెంటర్‌లో 200 నుంచి 300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని సంస్థ ప్రకటించింది. ఈమేరకు మంత్రి లోకేశ్‌ సమక్షంలో బుధవారం రాత్రి ఢిల్లీలో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌తో రాష్ట్ర ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు ఒప్పందం చేసుకుంది.

Updated Date - Nov 14 , 2025 | 05:19 AM