Google CEO Sundar Pichai: ఆయన మాటల్లోనే విందాం!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:15 AM
విశాఖకు గూగుల్ డేటా హబ్ గురించి ప్రభుత్వం ఏమంటోంది... వైసీపీ నేతలు ఏమంటున్నారనే విషయాన్ని కాసే పు పక్కనపెడదాం! ఇటీవల వందలమంది సమక్షంలో....
విశాఖకు గూగుల్ డేటా హబ్ గురించి ప్రభుత్వం ఏమంటోంది... వైసీపీ నేతలు ఏమంటున్నారనే విషయాన్ని కాసే పు పక్కనపెడదాం! ఇటీవల వందలమంది సమక్షంలో జరిగిన ఒక సదస్సులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏమన్నారో విందాం! ‘‘నేను దక్షిణాది రాష్ట్రాల్లో రైలులో ప్రయాణించేవాడిని. అక్కడ వైజాగ్ అనే నగరం ఉంది. సముద్ర తీరాన ఉన్న అందమైన నగరమది. బాగా అభివృద్ధి చెందుతోంది. విశాఖ కేంద్రంగా అమెరికా బయట అతిపెద్ద ఏఐ ఇన్వె్‌స్టమెంట్ ప్రకటించాం. ఇది 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి! ఈ ప్రాజెక్టులో 80 శాతం హరిత ఇంఽ దనం వినియోగిస్తాం. సముద్ర గర్భంలో కేబుల్స్ వస్తాయి. ఈస్థాయి పెట్టుబడితో ఆ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మా రే అవకాశముంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఒక గొప్ప మైలురాయి.’
- సుందర్ పిచాయ్