Share News

గ్రామీణులకు శుభవార్త

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:31 PM

ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన సమస్యలకు చెక్‌ పెట్టి ఏళ్ల నాటి గ్రామీణ ప్రజల కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

   గ్రామీణులకు శుభవార్త

కొత్త పంచాయతీలకు శ్రీకారం...!

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు

జిల్లాలో నాలుగు పంచాయతీలకు అవకాశం

త్వరలో ప్రభుత్వానికి నివేదిక : డీపీవో

ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన సమస్యలకు చెక్‌ పెట్టి ఏళ్ల నాటి గ్రామీణ ప్రజల కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల విభజనతో పాటు కొత్త పంచాయతీల ఏర్పాటకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఏడు నియోజకవర్గాలు, 28 మండలాలు కలవు. 489 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 11 మేజర్‌ పంచాయతీలు( గ్రేడ్‌-1) కలవు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి నివేదికలు సిద్ధం చేసి పంపాలని డీపీవో లలితాబాయి ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలను ఆదేశించారు.

నంద్యాల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభు త్వం శుభవార్తను అందించింది. జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటుకానున్నాయి. ఏది ఏమైనా నూతన విధానంతో దూరంగా ఉన్న గ్రామాలను సమీపంలోని పంచాయతీల్లో కలపడం.. అవసరమైన ప్రాంతాల్లో కొత్త పంచాయతీల ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది.

జిల్లాలో పరిస్థితి ఇలా...

ఫ జిల్లాలో నియోజకవర్గాలు : 07

ఫ మండలాలు : 28

ఫ జిల్లాలోని పంచాయతీలు : 489

ఫ ఇందులో మేజర్‌ పంచాయతీలు : 11

--------------------------------------

కొత్తగా ప్రతిపాదించే పంచాయతీకి..

జిల్లాలో నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన, పాణ్యం, నందికొట్కూ రు నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడైనా పంచాయతీ ఏర్పాటు చేయాలంటే.. జనాభా, ఆదాయ వనరులు, ప్రస్తుతం ఉండే పంచాయతీకి.. కొత్తగా ప్రతిపాదించే పంచాయతీకి మధ్య దూరం.. రెవెన్యూ సర్వే నెంబర్లు విభజన తదితర అంశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంది. ఒక పంచాయతీని రెండు పంచాయతీలుగా మార్పు చేయడం.. రెండు పంచాయతీలను ఒకే పంచాయతీగా మార్చడం.. ఒక పంచాయతీలోని గ్రామాన్ని మరోక పంచాయ తీలోకి కలిపే అవకాశముంది. గ్రామాల విలీనం విషయంలో పకడ్బందీగా పాలక వర్గం తీర్మానం తప్పకుండా ఉండాలి. మార్పులు.. చేర్పులు అంశాలపై ఆయా మం డల పరిధిలో చేయాల్సి ఉంది. మండలాల శివారు గ్రామాలు లేదా పంచాయతీలను ప్రస్తుత ఉన్న మండలాల్లో కాకుండా.. ఇతర మండలాల్లో కలపడం.. లేక విభజించడం వంటి అవకాశం ఉండదు.

ఈనెల 20వ తేదీ లోపు..

ప్రభుత్వ ఆదేశాలు మేరకు.. కొత్త పంచాయతీల ఏర్పాటు.. విలీనం తదితర అంశాల పరంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజల నుంచి వినతులను పరిశీలించి 20వ తేదీ లోపు ప్రతి పాదనలు పంపాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) లలితాబాయి జిల్లాలోని ఎంపీడీవోలకు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఆదేశించారు. ఆతర్వాత జిల్లా ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లి సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి త్వరలోనే అందజే యనున్నారు.

కొత్తగా నాలుగు పంచాయతీలు...

ప్రభుత్వ తాజా ఆదేశాలతో త్వరలో జిల్లాలో నాలుగు కొత్త పంచాయతీలు ఏర్పాట య్యే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆళ్లగడ్డ, బనగాన పల్లె, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉందని తెలిసింది. ఏది ఏమైనా తాజా మార్గదర్శకాలతో త్వరలో కొత్త పంచాయతీలు రానున్నట్లైంది.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటు అంశాలపై అధి కారులకు ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలు పక్కాగా పాటించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదనలు రాగానే.. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం.

లలితాబాయి, డీపీవో, నంద్యాల

Updated Date - Dec 03 , 2025 | 11:31 PM