Central Government Employees: వేతన పెంపునకు ఒకరోజు ముందు ఉద్యోగ విరమణ చేసినా హైక్ వర్తిస్తుంది
ABN , Publish Date - May 22 , 2025 | 05:44 AM
వేతన పెంపు రోజుకు ముందే రిటైర్ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డీవోపీటీ స్పష్టం చేసింది. జనవరి 1, జూలై 1 తేదీల్లో వేతన పెంపు అమలయ్యే నేపథ్యంలో, డిసెంబరు 31, జూన్ 30న రిటైర్ అయ్యేవారికి ఇది ప్రయోజనం కలిగించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప ఊరట
న్యూఢిల్లీ, మే 21: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వేతన పెంపునకు ఒకరోజు ముందే ఉద్యోగ విరమణ చేసే వారికి తమకు పెంపు వర్తించదేమోనన్న ఆందోళన అక్కర్లేదు! వార్షిక వేతన పెంపు తేదీకి ఒక్కరోజు ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల పెంపునకు జనవరి 1, జూలై 1 తేదీలను ప్రతిపాదించారు. ఈ మేరకు డిసెంబరు 31, జూన్ 30 తేదీల్లో ఉద్యోగ విరమణ చేసేవారికి కూడా నోషనల్ హైక్ వర్తించనుంది. ఇదివరకు.. ఇలాంటి వాటిల్లో కోర్టు ఉత్తర్వులు జారీ అయిన కేసుల్లోనే నోషనల్ ఇంక్రిమెంట్ వర్తింపజేసేవారు. తాజాగా కేంద్రమే ప్రకటన చేయడంతో డిసెంబరు 31, జూన్ 30 తేదీల్లో రిటైర్ అయిన ఉద్యోగులకూ ప్రయోజనం కలగనుంది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి