Share News

సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యం

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:43 PM

రాష్ట్రంలో సుపరిపాలన, అభి వృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని డోన ఎమ్మె ల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యం
కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

బేతంచెర్ల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుపరిపాలన, అభి వృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని డోన ఎమ్మె ల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొలుములపల్లె, బలపాలపల్లె, పాపసాని కొట్టాల, తవిసికొండ గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలు అందించారు. అంతకుముందుగా ఆయా గ్రామాల్లోని టీడీపీ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేను పూలమాలలతో సత్కరించారు. అనం తరం కొలుములపల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్ల నాగ య్య, సీనియర్‌ నాయకులు పోలూరు శ్రీనివాసరెడ్డి, పోలూరు రాఘవ రెడ్డి, మండల సహకార సంఘం చైర్మన చంద్రశేఖర్‌, తిరుమలేష్‌ చౌదరి, జావాజీ వెంకటేశ్వర్లు, సుధాకర్‌, బుగ్గన బ్రహ్మానందరెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:43 PM