Share News

ప్రభుత్వ పాఠశాల్లో మంచి సదుపాయాలు

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:22 AM

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని ట్రైనీ ఐఏఎస్‌లు అంకిత రాజ్‌పుత, మోహిత మంగల్‌, భరతదత తివారి, తన్మయి మెగ్వాల్‌, అమర్‌ బాగిల్‌, ఏ.సోనీలు అన్నారు.

 ప్రభుత్వ పాఠశాల్లో మంచి సదుపాయాలు
మద్దికెర పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ట్రైనీ ఐఏఎస్‌లు

ట్రైనీ ఐఏఎస్‌ల అభిప్రాయం

మద్దికెరలో పర్యటించిన అధికారులు

మద్దికెర, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని ట్రైనీ ఐఏఎస్‌లు అంకిత రాజ్‌పుత, మోహిత మంగల్‌, భరతదత తివారి, తన్మయి మెగ్వాల్‌, అమర్‌ బాగిల్‌, ఏ.సోనీలు అన్నారు. మంగళవారం మద్దికెర మండల కేంద్రంలోని జిల్లా పరిషత బాలికల పాఠశాలను ట్రైనీ ఐఏఎస్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందని, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, చదువులు అన్నీ ఇస్తున్నారనీ, విద్యార్థులు ఐఏఎస్‌ల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌లు మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం బాగా తీర్చిదిద్దుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారనీ, కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలన్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌ అదికారుల బృందంగా మద్దమ్మకుంటను పరిశీలించింది. అనంతరం మద్దికెర, బురుజుల శివారులో పత్తి, ఉల్లి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గుండాల్‌ నాయక్‌, ఎంపీడీవో కొండయ్య, ఎంఈవో రంగస్వామి, మోహన, ఏపీవో నర్సిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రవి, ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ మయాంక్‌, పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌, ప్రధానోపాద్యాయులు దేవేంద్రప్ప, వ్యవసాయ సిబ్బంది బోజరాజు, ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:22 AM