Share News

CM Chandrababu Vision: స్వర్ణాంధ్ర 2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:16 AM

స్వర్ణాంధ్రప్రదేశ్‌- విజన్‌ 2047లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

CM Chandrababu Vision: స్వర్ణాంధ్ర 2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

  • చైర్మన్‌గా సీఎం చంద్రబాబు.. కో-చైర్మన్‌గా టాటా సన్స్‌ ఈసీ చంద్రశేఖరన్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్రప్రదేశ్‌- విజన్‌ 2047లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి సీఎం చంద్రబాబు చైర్మన్‌గా, టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సీఐఐ డైరక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, అపోలో హాస్పిటల్స్‌ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ ప్రీతారెడ్డి, భారత్‌ బయోటెక్‌ కో-ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్ల, నాసర్‌ వర్సిటీ కంప్యూటర్స్‌ విభాగం ప్రొఫెసర్‌ రాజ్‌రెడ్డి, రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ చైర్మన్‌ సతీష్ రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎన్‌ సుబ్రహ్మణియన్‌, సీఎస్‌ సభ్యులుగా ఉంటారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా.. రాష్ట్రంలో ఆర్థిక, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. 2024-29 కాలంలో భారీ పరిశ్రమలు, ఎంఎ్‌సఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌ పాలసీల రూపకల్పనలో సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొంది.

Updated Date - Jun 11 , 2025 | 05:16 AM