Share News

Gold Chains Stolen: తిరుమలలో చోరీ

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:42 AM

తిరుమలలో పార్కింగ్‌ చేసిన కారు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరుకు ..

Gold Chains Stolen: తిరుమలలో చోరీ

  • కారు అద్దాలు పగలగొట్టి బంగారు కమ్మల అపహరణ

తిరుమల, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో పార్కింగ్‌ చేసిన కారు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన నిత్యవేల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి కారులో తిరుమల వచ్చారు. నారాయణగిరి విశ్రాంతి భవనం ముందున్న ప్రదేశంలో కారు పార్కింగ్‌ చేశారు. దర్శనం అనంతరం గురువారం ఉదయం కారు వద్దకు రాగా, అద్దాలు పగిలిపోవడాన్ని గుర్తించారు. సీట్లోని బ్యాగులు కూడా చెల్లాచెదురుగా పడిఉండటంతో టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు జతల బంగారు కమ్మలు ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 04:42 AM