వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:42 PM
దేవీశరన్నవరాత్రులలో భాగంగా మండల పరిధిలోని నెహ్రూనగర్‌లో వివిధ రూపాలలో పూజలు అందుకున్న దుర్గాదేవి అమ్మవారిని 12వ రోజు శనివా రం వైభవంగా భక్తులు కృష్ణనదిలో నిమజ్జనం చేశారు.
పగిడ్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేవీశరన్నవరాత్రులలో భాగంగా మండల పరిధిలోని నెహ్రూనగర్‌లో వివిధ రూపాలలో పూజలు అందుకున్న దుర్గాదేవి అమ్మవారిని 12వ రోజు శనివా రం వైభవంగా భక్తులు కృష్ణనదిలో నిమజ్జనం చేశారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, పిల్లలు నృత్యాలు, భజన, కోలాటలతో సందడి చేశారు. అనంతరం మూర్వకొండ ఘూట్ సమీపంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సందడిగా సాగిన వసంతోత్సవం
ఆత్మకూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం వసంతోత్సవం సందడిగా సాగింది. పండుగ సాంప్రదాయం ప్రకారం విజయదశమి మరుసటి రోజు శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారికి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజున వసంతోత్సవంతో రంగులు చల్లుకుంటూ పండుగ విజయవంతమైందని ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. అలాగే ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. ఆర్యవైశ్యులందరు సామూహిక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నరహరి సత్యనారాయణఝ మాట్లాడుతూ.. దేవీ శరన్నవరాత్రులను సందర్భంగా శ్రీవాసవీ మాత ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగేందుకు సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.