Godavari Water Released: పట్టిసీమ నుంచి తరలిన గోదారమ్మ!
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:44 AM
ఏలూరు జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేశారు....
పోలవరం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం 15.60 మీటర్లకు పైగా ఉండడంతో రెండు మోటార్లు, రెండు పంపుల ద్వారా 708 క్యూసెక్కుల జలాలను విడుదల చేశామని ఈఈ యేసుబాబు తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు 11.10 టీఎంసీల నీటిని విడుదల చేశారు. 2015 అక్టోబరు నుంచి 418 టీఎంసీలు పంపిణీ చేయగా, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020-24 వరకు 101టీఎంసీలను మాత్రమే విడుదల చేసింది.