Share News

Water Level Rise: భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:32 AM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది.

Water Level Rise: భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • పోలవరం నుంచి దిగువకు 1,33,288 క్యూసెక్కులు విడుదల

పోలవరం, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ఉప నదులు, కొండవాగుల నుంచి వరద భారీగా వచ్చి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన 1,33,288 క్యూసెక్కుల గోదావరి వరదను స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 27.430 మీటర్లు, స్పిల్‌వే దిగువన 17.500 మీటర్లు నీటిమట్టం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Jul 23 , 2025 | 05:33 AM