Water Level: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:46 AM
పోలవరంలో గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి అనూహ్యంగా పెరిగింది. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న...
పోలవరం నుంచి 8,06,738 క్యూసెక్కులు విడుదల
పోలవరం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పోలవరంలో గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి అనూహ్యంగా పెరిగింది. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉప నదులు కడెం, మంజీర, హరిద్ర, ఇందావతి, మానేరు, ప్రాణహిత, కిన్నెరసాని, శబరి, సీలేరు నదుల జలాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 8,06,738 క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.90 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 31.750 మీటర్లు, దిగువన 23.000 మీటర్లు నమోదైనట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.