Share News

Godavari River: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:07 AM

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, కొండవాగుల వరద గోదావరిలో కలిసి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. అదనంగా వస్తున్న జలాలను పోలవరం ప్రాజెక్టు...

Godavari River: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

పోలవరం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, కొండవాగుల వరద గోదావరిలో కలిసి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. అదనంగా వస్తున్న జలాలను పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు, స్పిల్‌వేలో 6 స్లూయిజ్‌ గేట్ల నుంచి దిగువకు విడిచిపెడుతున్నారు. 28,879 క్యూసెక్కుల జలాలను విడుదల చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు. స్పిల్‌వే ఎగువన 26.090 మీటర్లు, దిగువన 17.290 మీటర్లు, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాంల మధ్య 15,320 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

Updated Date - Jun 30 , 2025 | 03:09 AM