Share News

లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:04 AM

స్వర్ణాంధ్ర -2047లో భా గంగా నియోజకవర్గ విజన యాక్షనప్లానలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర -2047లో భా గంగా నియోజకవర్గ విజన యాక్షనప్లానలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో యాక్షనప్లానపై వివిధ శాఖల అధికారులు, యంగ్‌ప్రొఫెషన్స జీఎ్‌సడబ్ల్యూఎస్‌ సిబ్బందితో ఓరియంటేషన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు, యంగ్‌ప్రొఫెషనల్స్‌ కృషిచేయాలన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, టూరిజం రంగాల్లోన్ని వనరులను వినియోగించుకుని జీడీపీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండసి్ట్రయల్‌ సెక్టార్‌లో జిల్లా మొదటి స్థానంలో నిలవాలంటే ప్రతి మండలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ, డీఆర్డీ, ఏపీడీ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:04 AM