AP Govt: గిరిజనులకూ పెద్ద గ్యాస్ సిలిండర్లపై జీవో
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:04 AM
రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కూడా ఇకపై పెద్ద సిలిండర్లు అందనున్నాయి.
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కూడా ఇకపై పెద్ద సిలిండర్లు అందనున్నాయి. ‘దీపం-2’ పథకం కింద ప్రస్తుతం అందజేస్తున్న 5 కిలోల ఎల్పీజీ గిరిజన ప్యాకేజీ సిలిండర్లను 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లుగా మారుస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంటేషన్ చార్జీల కోసం రూ. 5.54 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 23,912 మంది అర్హులైన గిరిజనులకు లబ్ధి చేకూరనుంది.