Minister Ram Mohan Naidu: ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా బాలయోగి
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:26 AM
జీఎంసీ బాలయోగి... కోనసీమ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో...
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘జీఎంసీ బాలయోగి... కోనసీమ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఒకటైన లోక్‌సభ స్పీకర్ పదవిని చేపట్టారు. బాలయోగి ప్రస్థానం ప్రజలపట్ల ఆయనకున్న అంకితభావాన్ని, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నిబద్థతను ప్రతిబింబిస్తుంది’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయడు అన్నారు. బుధవారం లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన చిత్రపటానికి ఎంపీ సానా సతీశ్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌తో కలసి కేంద్ర మంత్రి నివాళి అర్పించారు. ‘నిరాడంబరమైన జీవనశైలితో బాలయోగి ప్రజల మనసులను గెలుచుకున్నారు. భారత పార్లమెంటరీ చరిత్రలో మాత్రమే కాదు... ప్రజల హృదయాల్లోనూ ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు’ అని రామ్మోహన్‌నాయడు అన్నారు.