పదిలో బాలికలు టాప్
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:09 AM
పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
పదో తరగతిలో జిల్లా ఉత్తీర్ణత శాతం 65.45
ఈసారి కూడా బాలికలదే పైచేయి
బాలుర ఉత్తీర్ణత శాతం 60.36
బాలికల ఉత్తీర్ణత శాతం 72.21
జిల్లాలో పెరిగిన పది ఉత్తీర్ణత శాతం
కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈసారి కూడా పది ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో 25వ స్థానంలోకి పడిపోయింది. గత ఏడాదిని పోల్చుకుంటే జిల్లా ఉత్తీర్ణత శాతం రంటూ 2.98 శాతం అదనంగా పెరిగింది. కర్నూలు జిల్లాలో 512 ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం విద్యార్థులు 31,185 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 20,584 మంది పాసై 65.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 16320 మంది పరీక్షకు హాజరు కాగా 9854 మంది పాసై 60.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బాలికలు మొత్తం 14,859 మందికిగాను 10,730 మంది పాసై 72.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పది ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే గత ఏడాది కంటే అదనంగా 2.98 ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం 62.47 శాతం కాగా ఈ ఏడాది 65.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో కర్నూలు వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల విద్యార్థిని పాలబండ్ల తన్మయి గాయత్రి 597/600 మార్కులు, కర్నూలు భాస్కర్ నగర్‌లోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థిని పి. గీతిక (పగిడ్యాల) 597మార్కులు, కర్నూలు ఎల్కూరు బంగ్లా నారాయణ పాఠశాల విద్యార్థిని సేగూ వెంకట కీర్తన 597, ఆదోని రూట్ గ్లోబల్ ఇంగ్లీషు మీడియం పాఠశాలకు చెందిన దేవనకొండ సలీమ 597 మార్కులు, ఆదోని అక్షరశ్రీ ఇంగ్లీషు మీడియం పాఠశాలకు చెందిన కే. గౌతమి నంద 597, ఆదోని భాష్యం హైస్కూల్ వగరూరు హరిని 597 మార్కులు కర్నూలు శ్రీచైతన్య పాఠశాల మాలదాసరి సాయినందిని 596 మార్కులు, రత్నపల్లి మనుచరణ్ 596, అనగాలి నేహ 596, యశస్విని 595, కర్నూలు డా. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన ఉన్నత పాఠశాల విద్యార్థిని సాయి లిఖిత 595 మార్కులు సాధించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల వారిగా పదో తరగతి పలితాలు ఈ విధంగా ఉన్నాయి.
ఫ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1872 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 951 మంది పాసై 50.80 శాతం ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు బీ. క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ అర్షియా మల్లిక 586 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 14,419 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, 7039 మంది పాసై 48.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే మున్సిపాలిటీ యజమాన్య పాఠశాలలో 1838 మందికి గాను 961 మంది పాసై 52.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు, అన ఎయిడెడ్ యాజమాన్య పాఠశాలలో 9497 మందికి గాను 8647 మంది పాసై 91.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్ స్కూల్స్‌లో 1333 మందికి గాను 930 మంది పాసై 69.76 శాతం, బీసీ వెల్ఫేర్ పాఠశాలలో 227 మందికి గాను 221 మంది పాసై 97.35 శాతం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 978 మందికి గాను 774 మంది పాసై 79.14 శాతం, ఎయిడెడ్ పాఠశాలలో 187 మందికి గాను 102 మంది పాసై 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఆర్‌ఎస్ పాఠశాలలో 374 మందికి గాను 360 మంది పాసై 96.25 శాతం, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలలో 544 మందికి గాను 483 మంది పాసై 88.78 శాతం, అలాగే ఏపీటీడబ్ల్యూఎస్ పాఠశాలలో 91 మందికి గాను 61మంది పాసై 65.93 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫ సబ్జెక్టుల వారిగా..: పదో తరగతి పబ్లిక్ పరీక్షలో సబ్జెక్టుల వారిగా ఉత్తీర్ణతను పరిశీలించినట్లయితే తెలుగు సబ్జెక్టులో 31416 మంది విద్యార్థులకు గాను 28,818 మంది పాసై 91.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే హిందీ సబ్జెక్టులో 31405 మందికి గాను 31,113 మంది పాసై 99.08 శాతం, ఇంగ్లీషులో 31.385 మందికిగాను 26,726 మంది పాసై 85.16 శాతం, గణితంలో 31,443 మందికిగాను 23,662 మంది పాసై 75.2 శాతం, పీఎస్ అండ్ బీఎస్‌లో 31,443 మందికి గాను 24,543 మంది పాసై 78 శాతం, సోషల్ స్టడీస్‌లో 31,443 మందికి గాను 26,946 మంది పాసై 85.6 శాతం ఉత్తీర్ణత సాధించారు.
గత ఏడు సంవత్సరాల నుంచి పదో తరగతి ఫలితాలు ఈ కింది విదంగా ఉన్నాయి:
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సంవత్సరం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
బాలురు బాలికలు మొత్తం :: బాలురు బాలికలు మొత్తం :: బాలురు, బాలికలు మొత్తం
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
2018-19 27407 23384 50791 25125 21655 46780 91.67 92.61 92.1 శాతం
2019-20 28010 24258 52268 28010 24258 52268 100 100 100 శాతం
2020-21 27907 24450 52357 27907 24450 52357 100 100 100 శాతం
2021-22 27302 24367 51669 15010 15059 30069 54.98 61.80 58.20 శాతం
2022-23 15258 13528 28786 852