Share News

Union Minister Hardeep Singh: జీసీసీ అరకు కాఫీకి అవార్డు

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:43 AM

బిజినెస్‌ లైన్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డ్స్‌-2025లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అరకువేలీ కాఫీకి ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో ‘చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025...

Union Minister Hardeep Singh: జీసీసీ అరకు కాఫీకి అవార్డు

విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘బిజినెస్‌ లైన్‌’ చేంజ్‌ మేకర్‌ అవార్డ్స్‌-2025లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అరకువేలీ కాఫీకి ‘ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ విభాగంలో ‘చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025’ అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి చేతుల మీదుగా జీసీసీ ఎండీ, వైస్‌ చైర్‌పర్సన్‌ కల్పనకుమారి ఈ అవార్డు అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ అరకులోయ కాఫీ ఒక బ్రాండ్‌ మాత్రమే కాదని, గిరిజనుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పారు.

Updated Date - Sep 28 , 2025 | 04:43 AM