సీమకు తరతరాల అన్యాయం
ABN , Publish Date - May 02 , 2025 | 11:37 PM
రాయలసీమకు తరతరాలుగా పాలకులు అన్యాయం చేస్తూనే వస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి అన్నారు.
రూ.1500 కోట్లు కేటాయిస్తే 10లక్షల ఎకరాలకు సాగునీరు
కర్నూలులోనే కృష్ణాబోర్డు ఏర్పాటు చేయాలి
శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్‌ఫూల్ మరమ్మతు చేయాలి
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి
రుద్రవరం, మే 2 (ఆంధ్రజ్యోతి) : రాయలసీమకు తరతరాలుగా పాలకులు అన్యాయం చేస్తూనే వస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి అన్నారు. శుక్రవారం రుద్రవరంలోని తహసీల్దారు కార్యాలయం ముందు రైతులతో కలిసి తెలుగుగంగ ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించి తహసీల్దారు మల్లికార్జునరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా రాయలసీమ తాగునీటి, సాఽగునీటికై కేటాయించాలని నాఆ్నరు. కృష్ణానది యాజమాన్యం బోర్డు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని, రూ.1500 కోట్లు కేటాయిస్తే వచ్చే ఖరీఫ్ నాటికి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలవుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్‌ఫూల్‌కు మరమ్మతు చేయాల న్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచడానికి సిద్ధ్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రతి సంవత్సరం 30 లక్షల నుండి కోటి ఎకరాలకు సరిపడే కృష్ణాజలాలు సముద్రంపాలు అవుతున్నాయన్నారు. తుంగభద్ర, కృష్ణా, పెన్నానదులు ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్నాయని, రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి పంట పొలాలకు పరిశ్రమలకు, విద్య, వైద్య సంస్థలకు అ ందించడానికి కావాల్సిన నీటి హక్కులున్నాయని అన్నారు. అయితే పాలకుల విధానాల వల్ల రాయలసీమ వెనుకబడిపోయిందని అన్నారు. కృష్ణాజలాలను సక్రమంగా వినియోగించుకోవడానికి క్రిష్ణానది యాజమాన్యం బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలుగోడు రిజర్వాయరు, చెన్నై కాల్వ (తెలుగుగంగకాల్వ) పూర్తి స్ధామర్యంలో పని చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామగుర్విరెడ్డి, పార్ధసారథిరెడ్డి, హరిక్రిష్ణ, రామక్రిష్ణారెడ్డి, మహబూబ్‌బాషా, దేవానందరెడ్డి, మహేంద్రరెడ్డి, వీరబ్రహ్మానందరెడ్డి, కొమ్ము శ్రీహరి పాల్గొన్నారు.
30వేల మందితో సిద్దేశ్వరం అలుగు వార్షికోత్సవ సభ
రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరధరామిరెడ్డి
ఈ నెల 31న సిద్ధేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవం 30వేల జనాభాతో నిర్వహిస్తామన్నారు. జలమేజీవం, జలమే బలం, జలమే సర్వం అన్నారు. రాయలసీమలోని ప్రతి రైతు 31వతేదీన సంగమేశ్వరం చేరుకుని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.