Share News

ప్యాలెస్‌లపై ఉన్న శ్రద్ధ కాలేజీలపై పెట్టలేదు: గంటా

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:49 AM

రుషికొండపై రూ.500కోట్లతో ప్యాలెస్‌, ప్యాలెస్‌ నమూనాలో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్న జగన్మోహన్‌రెడ్డి.. నాడు మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై...

ప్యాలెస్‌లపై ఉన్న శ్రద్ధ కాలేజీలపై పెట్టలేదు: గంటా

విశాఖపట్నం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రుషికొండపై రూ.500కోట్లతో ప్యాలెస్‌, ప్యాలెస్‌ నమూనాలో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్న జగన్మోహన్‌రెడ్డి.. నాడు మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై శ్రద్ధ పెట్టి ఎందుకు పూర్తిచేయలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. జగన్‌ హయాంలో కేవలం ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే అప్‌గ్రేడ్‌ చేశారని, మిగిలిన వాటిలో 20 శాతం పనులు కూడా చేయలేదని ఆరోపించారు. ఎవరైనా వాటిని కాంట్రాక్టుకు తీసుకుంటే అధికారంలో వచ్చాక రద్దు చేస్తానని చెప్పడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రైవేటీకరణకు, పీపీపీకి తేడా తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 06:50 AM