Share News

వేడుకలకు గణనాథులు సిద్ధం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:47 PM

వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో వేడుకలకు గణనాథులు సిద్ధమవుతు న్నారు.

వేడుకలకు గణనాథులు సిద్ధం
ముస్తాబైన గణనాథులు

జమ్మలమడుగు/ప్రొద్దుటూరు అర్బన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో వేడుకలకు గణనాథులు సిద్ధమవుతు న్నారు. ఈనెల 27వ తేదీ వినాయక చవితి పర్వదినం పురష్కరించుకుని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద విగ్రహాల అమ్మకాలకు నిర్వాహకు లు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల కమిటీవారు వచ్చి చాలా వరకు విగ్రహాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో రంగురంగుల వినాయక విగ్రహాలు ప్రత్యేక అలంకరణగా నిలిచా యి. అలాగే ప్రత్యేక ఆకర్షణగా ఓ వినాయక విగ్రహాన్ని విద్యుత పరికరాలతో కళ్లు మూయడం, తెరువడం లాంటి ప్రత్యేక ఆక్షరణగా నిర్వాహకులు తయారు చేశారు. గణేష్‌ చతుర్థి సందర్భంగా లక్షల సంఖ్యలో విగ్రహాలను ప్రజలు ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆనవాయితాగా వస్తోంది. గతంలో కొన్ని కొన్ని గల్లీలలోనే విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. క్రమేణ ఏడాదికేడాది గల్లీకి మూడు నుంచి నాలుగైదు విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా వేడుకలు చేస్తున్నారు. ఇందకు యువత ముందుకు రావడంతో గణేష్‌ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ముప్పుగా పరిణమిస్తున్న పీవోపీ విగ్రహాలు

ఈ విగ్రహాలు ప్రధానంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ (పీవోపీ)తో తయారవుతున్నాయి. ముప్పుగా పరిణమిస్తున్న ఈ పీవోపీ వ్రిగ్రహాల నిర్మాణం తక్కువ ఖర్చుతోపాటు ఆకర్షణీయంగా ఉండడం వలన ప్రజల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పీవోపీ విగ్రహాలు పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నా వాటి నివార ణపై ప్రచారం సరిగా లేనందున ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పీవోపీ విగ్రహాల్లో వాడే రంగుల్లో పాదరసం, సీసం, క్రోమియో వంటి విషపూరిత లోహాలు కలిగి ఉంటుందని దాని ప్రభావంతో విగ్రహాల నిమజ్జనం సమయంలో చెరువులు, నదులను కాలుష్యం చేస్తుందని అందు వల్ల మట్టివినాయకులనే వాడాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:47 PM