మట్టి విగ్రహాలతో గణేశ ఉత్సవాలు నిర్వహించాలి
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:32 PM
మట్టివిగ్రహాలతో గణేశ ఉత్సవాలు నిర్వహించాలని బనగానపల్లె కేంద్ర గణేశ ఉత్సాహ కమిటీ గౌరవ సలహాదారుడు టంగుటూరు శ్రీనయ్య, అధ్యక్షుడు మల్లారెడ్డి సూచించారు.
- బనగానపల్లె కేంద్ర గణేశ ఉత్సవ కమిటీ గౌరవ
సలహాదారుడు టంగుటూరు శ్రీనయ్య
బనగానపల్లె, జూలై 22 ( ఆంధ్రజ్యోతి): మట్టివిగ్రహాలతో గణేశ ఉత్సవాలు నిర్వహించాలని బనగానపల్లె కేంద్ర గణేశ ఉత్సాహ కమిటీ గౌరవ సలహాదారుడు టంగుటూరు శ్రీనయ్య, అధ్యక్షుడు మల్లారెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కేంద్ర గణేశ ఉత్సవ కమిటీ గణేశ మట్టి విగ్రహాల వాడకంపై అవగా హన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సొంత నిధులతో చిన్న మట్టివిగ్రహాలను తెప్పిస్తున్నట్లు తెలి పారు. అవసరమైన వారికి ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హిందూ బంధువులు, కేంద్ర గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేసి మండపాల్లో మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించుకోవాలని తీర్మానించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ నిమజ్జనం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 27న మండపాలల్లో గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి ఐదురోజుల పూజల అనంతరం ఆగస్టు 31న నిమజ్జన కార్యక్రమం బనగానపల్లె మండలంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో టీచర్ నాగరాజు, కోడి నాగేశ, గులాంనబీపేట రఘు, కూరగాయల శేఖ ర్, బాలుడు, భరతుడు, వంకదారి ప్రసాద్, సాయిరాం, గుండామురళి, గౌండసుబ్బయ్య, గడ్డం నాగమణి, సూర్య, కృష్ణం రాజు, టీచర్ ప్రతాప్, మనోహర్, బింగిమళ్ల సుబ్రమణ్యం, శ్రీను, కృష్ణ పాల్గొన్నారు.