Funeral Delayed: శ్మశాన స్థల వివాదం... ఆగిన అంత్యక్రియలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:57 AM
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లిలో శ్మశాన స్థల వివాదంతో మృతుడి అంత్యక్రియ లు నిలిచిపోయాయి. నారాయణప్ప(77)అనే దళితు డు అనారోగ్యంతో...
శవపేటిక వద్ద బైఠాయించి దళితుల ఆందోళన
చెన్నేకొత్తపల్లి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లిలో శ్మశాన స్థల వివాదంతో మృతుడి అంత్యక్రియ లు నిలిచిపోయాయి. నారాయణప్ప(77)అనే దళితు డు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. అంతక్రియల ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులు శ్మశాన ప్రాంతానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన శంకరనారాయణ వర్గీయులు అడ్డు చెప్పారు. ఈ స్థల వివాదం కోర్టులో ఉందని, ఇక్కడ ఖననం చేయడానికి వీలులేదన్నారు. ఆర్డీఓ మహేశ్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ గ్రామానికి చేరుకుని చర్చించారు. శ్మశాన స్థలం సమస్య కోర్టులో నడుస్తున్నందున ప్రత్యామ్నాయ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించుకోవాలని వారు సూచించగా.. దళితులు ససేమిరా అన్నా రు. సాయంత్రమైనా సమస్య కొలిక్కి రాకపోవడం తోఅంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, శవపేటిక వద్ద బైఠాయించి, నిరసన చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ..దళితుల శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి, సమాధులను ధ్వంసం చేసి పంటను సాగు చేసుకుంటున్నారని ఆరోపించా రు. ఇక్కడ 8 ఏళ్లుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పరిష్కారం చూపకపోవడం బాధాకరమన్నా రు. ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.