Share News

డిజిటల్‌ కార్పొరేషన్‌ నిధులు దారిమళ్లాయి: పార్థసారథి

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:23 AM

గత ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ నివేదిక ద్వారా స్పష్టమైందని...

డిజిటల్‌ కార్పొరేషన్‌ నిధులు దారిమళ్లాయి: పార్థసారథి

ఇంటర్నెట్ డెస్క్:త ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ నివేదిక ద్వారా స్పష్టమైందని, దీనిపై సీఐడీ విచారణ కొనసాగుతుందని సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2019-24 మధ్య రూ.2 కోట్లు దారి మళ్లించి యాత్ర-2 సినిమా కోసం ఖర్చు చేయడంపై ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, కూన రవికుమార్‌ శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. డిజిటల్‌ కార్పొరేషన్‌లో సుమారు 60 మందిని కనీస విద్యార్హతలు లేకుండా పోస్టుల్లో నియమించారని, సాక్షి పత్రిక, ఐప్యాక్‌, ఐడ్రీమ్‌ చానళ్లలో పనిచేసే మరో 19 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 07:23 AM