మొహర్రం వేడుకలకు నిధులు: మంత్రి బీసీ
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:10 AM
పట్టణంలో మొహర్రం వేడుకల నిర్వహ ణకు కూటమి ప్రభుత్వం రూ. 10లక్షల నిధులు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు.
బనగానపల్లె, జూన 23 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మొహర్రం వేడుకల నిర్వహ ణకు కూటమి ప్రభుత్వం రూ. 10లక్షల నిధులు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ లకు కూటమి ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరిం చారు. తన అభ్యర్థన మేరకు జిల్లా మైనార్టీ శాఖ నుంచి ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబునా యుడుకు, ముస్లిం మైనార్టీ మంత్రి ఎనఎండీ ఫరూక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.