Share News

Satvik Murari: నాడు గ్రహీత.. నేడు దాత

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:58 AM

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అంది వారి అభ్యున్నతికి ఉపయోగపడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పేందుకు చక్కటి ఉదాహరణగా నిలిచారు సాత్విక్‌ మురారి.

Satvik Murari: నాడు గ్రహీత.. నేడు దాత

  • 2016లో ‘విదేశీ విద్య’ లబ్ధిదారుడు సాత్విక్‌ స్ఫూర్తి

  • నలుగురు పేద విద్యార్థుల విదేశీ చదువుకు సాయం

  • సాత్విక్‌ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అంది వారి అభ్యున్నతికి ఉపయోగపడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పేందుకు చక్కటి ఉదాహరణగా నిలిచారు సాత్విక్‌ మురారి. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. వాటిలో విదేశీ విద్య పథకం కింద 2016లో ఐర్లాండ్‌ వెళ్లిన సాత్విక్‌ మురారి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌ పూర్తిచేశారు. తర్వాత కొంతకాలం అక్కడే ఉద్యోగం చేశారు. ప్రస్తుతం ఐర్లాండ్‌లోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాడు ప్రభుత్వ సాయంతో చదువుకున్న తాను కొందరు పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో సాత్విక్‌ మంగళవారం సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. నలుగురు పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా సాత్విక్‌ను సీఎం అభినందించారు. తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలన్న సాత్విక్‌ ఆలోచన మిగిలినవారికి స్ఫూర్తి కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - Jul 23 , 2025 | 05:01 AM