Ambedkar Study Circle: ఎస్సీ, ఎస్టీలకు యూపీఎస్సీ ఉచిత కోచింగ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:36 AM
ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్...
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేశ్ ఆదివారం తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో నాలుగు నెలల శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఈ నెల 26 వరకూ స్వీకరిస్తామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.