Share News

Minister Satyakumar: నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఆగలేదు

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:13 AM

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యసేవలు నిలిచిపోయాయం టూ ప్రభుత్వ వ్యతిరేక మీడియా ద్వారా...

Minister Satyakumar: నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఆగలేదు

  • పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు

  • గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లిస్తున్నాం

  • శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యసేవలు నిలిచిపోయాయం టూ ప్రభుత్వ వ్యతిరేక మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ శాసనసభ వేదికగా ప్రజలకు సూచించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యసేవలు కొనసాగించడంలో బాధ్యతారాహితంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పుడు కూడా రోగులు బాధపడుతూ.. మరణాలు జరిగితే రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ ఆరోగ్యశ్రీ బకాయిలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.2,222 కోట్లు బకాయి పెట్టిందని, వాటిని తమ ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుందని తెలిపాఠి రు. రూ.2,168 కోట్లకు సంబంధించిన బిల్లులు పరిశీలనలో ఉన్నాయన్నా రు. ప్రభుత్వాసుపత్రులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ద్వారా రూ.457.45 కోట్లు చెల్లించామని వివరించారు.

Updated Date - Sep 20 , 2025 | 07:14 AM