Minister Farooq: మైనార్టీలకు ఉచిత టెట్ కోచింగ్
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:47 AM
రాష్ట్ర విద్యా శాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనార్టీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
మంత్రి ఫరూక్
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యా శాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనార్టీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం) ద్వారా మైనార్టీలకు ఉచిత కోచింగ్ అందిస్తామని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నవంబరు మొదటి వారం నుంచి తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టెట్ పరీక్ష కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని మైనార్టీ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. తమ వివరాలను సీఈడీఎం వెబ్ సైట్ ఠీఠీఠీ.్చఞఛ్ఛిఛీఝఝఠీఛీ.ౌటజ లో నమోదు చేసుకోవాలని.. మరింత సమాచారం కోసం 0866-2970567, 7386789966 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.