Tadepalligudem: ఉచిత ఉల్లి కోసం..
ABN , Publish Date - Sep 11 , 2025 | 07:02 AM
ఊరకే వస్తే.. ఎవరూ వదులుకోరు! అనే సామెతను నిజం చేస్తూ.. ఉచితంగా వస్తున్న ఉల్లిపాయల కోసం తాడేపల్లిగూడెంలో జనం ఎగబడ్డారు. లారీపైకి ఎక్కి... కిందపడినవి ఏరుకుని..
ఇంటర్నెట్ డెస్క్: ఊరకే వస్తే.. ఎవరూ వదులుకోరు! అనే సామెతను నిజం చేస్తూ.. ఉచితంగా వస్తున్న ఉల్లిపాయల కోసం తాడేపల్లిగూడెంలో జనం ఎగబడ్డారు. లారీపైకి ఎక్కి... కిందపడినవి ఏరుకుని.. బస్తాలను బైకులపై పెట్టుకుని మరీ పట్టుకెళ్లారు. అసలేం జరిగిందంటే..! కర్నూలులో ఉల్లిపాయలకు ధర పడిపోయింది. వీటిని కిలో రూ.12కు ప్రభుత్వం కొనుగోలు చేసి, రాష్ట్రంలోని మార్కెట్లకు తరలిస్తోంది. ఈ ఉల్లిని తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తరలిస్తే.. నాణ్యతలేదంటూ వ్యాపారులు కొనడం మానేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వాటిని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఆ ఉల్లిని రోడ్లపక్కన పడేసేందుకు సిబ్బంది తీసుకెళ్తుంటే గమనించిన జనం.. పెదతాడేపల్లి వద్ద ఆ లారీల్లోకి ఎక్కి ఉల్లి బస్తాలు పట్టుకుపోయారు. జనం ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ జామైంది.
- తాడేపల్లిగూడెం రూరల్, ఆంధ్రజ్యోతి