Share News

మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:13 PM

డిసెంబరు 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు ఇవ్వనున్నట్లు చైర్మన రమేష్‌నాయుడు తెలిపారు.

   మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం

శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు చైర్మన రమేశనాయుడు

శ్రీశైలం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : డిసెంబరు 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు ఇవ్వనున్నట్లు చైర్మన రమేష్‌నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి రెండు లడ్డూలు, అతిశీఘ్ర దర్శనం టికెట్లు పొందిన వారికి ఒక లడ్డూను ఉచిత ప్రసాదంగా ఇవ్యనున్నారు. గోకులం ఆధునికీకరణ, నూతన డొనేషన కౌంటర్‌, చైర్మన ఛాంబర్‌, ఉచిత లడ్డూ ప్రసాద, కైలాస కంకణ కౌంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Updated Date - Nov 28 , 2025 | 11:13 PM