ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే ఉచిత విద్యుత
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:17 AM
పీఎం సూ ర్యఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ఫ్యానళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సుమారు 25ఏళ్ల పాటు ఉచిత విద్యుత పొందే అవకాశముందని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
పీఎం సూర్యఘర్ పథకంపై సమీక్ష
నంద్యాల నూనెపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పీఎం సూ ర్యఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ఫ్యానళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సుమారు 25ఏళ్ల పాటు ఉచిత విద్యుత పొందే అవకాశముందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం, కలెక్టర్ పీఎం సూర్యఘర్ పథకం అమలు, పురోగతిపై అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోలార్ ఫ్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత బిల్లులు తక్కువ రావడమే కాకుండా, ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. జిల్లాలో ఈ పథకం అమలుకు భాగంగా ఐదు మండలాల్లో ఐదు గ్రామాలను మోడల్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. శిరివెళ్ల, వెలుగోడు, బనగానపల్లి, నందికొట్కూరు, డోన మండలాల్లోని గోవిందపల్లె, వేల్పనూరు, నందవరం, వడ్డెమాను, చిన్నమల్కాపురం గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సోలార్ ఫ్యానళ్లు ఏర్పాటు చేసే పనులను ఆరు నెలల కాలవ్యవధిలో వందశాతం పూర్తి చేస్తే, సదరు గ్రామానికి కేంద్రప్రభుత్వం కోటి రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ స్పెషల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఆర్వో రామునాయక్, విద్యుత శాఖ ఎస్‌ఈ సుధాకర్, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు అనువైన ప్రదేశాలను గుర్తించండి
నంద్యాలలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశవ్యాప్తంగా ఈ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. వంద శాతం సబ్సిడీతో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే అవకాశముందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో స్థలాలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్చించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.