Minister Dola: దివ్యాంగులకు త్వరలో ఉచిత 3 చక్రాల మోటార్ వాహనాలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:53 AM
దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. మంగళవారం సచివాలయంలో పలువురు దివ్యాంగులు మంత్రిని కలిశారు. ఇటీవల దివ్యాంగులకు ఏడు వరాలు సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా త్వరలో త్రీవీలర్స్(రెట్రోఫిటెడ్ మెటారు వాహనాలు) అందిస్తామన్నారు. దివ్యాంగుల కోసం విశాఖలో రూ.200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు.