Share News

కార్పొరేషన్ల డైరెక్టర్లుగా నలుగురికి అవకాశం

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:37 AM

సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 11 కార్పొరేషన్ల డైరెక్టర్లను బుధవారం నియమించింది.

   కార్పొరేషన్ల డైరెక్టర్లుగా  నలుగురికి అవకాశం

టీడీపీ నుంచి మనోజ్‌, రామకృష్ణలకు అవకాశం

బీజేపీ, జనసేన నుంచి రాఘవేంద్ర, సుబ్బయ్య

కర్నూలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 11 కార్పొరేషన్ల డైరెక్టర్లను బుధవారం నియమించింది. డైరెక్టర్ల నియామకంలో జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కీలకమైన కార్పొరేషన్లలో ఛాన్స ఇవ్వడంతో జిల్లాకు రాజకీయంగా సముచిత స్థానం దక్కినట్లయింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి మూడు పార్టీల్లో ముగ్గురికి కార్పొరేషన్ల డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన నగరూరు శమంతకమణి కుమారుడు, బీజేపీ సీనియర్‌ నాయకుడు నగరూరు రాఘవేంద్రకు ఏపీ స్టేట్‌ ఎడ్యుకేషన అండ్‌ వెల్ఫేర్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన డైరెక్టరుగా నియమించారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ ఎగ్జిక్యూటివ్‌ మెంబరుగా పని చేశారు. గత వైసీపీ హయాంలో జరిగిన రాయలసీమ పట్టుభధ్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. జనసేన సీనియర్‌ నాయకుడు, రాఘవేంద్ర టాలెంట్‌ కరస్పాండెంట్‌ పీబీవీ సుబ్చయ్యను ఏపీ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన డైరెక్టరుగా అవకాశం ఇచ్చారు. పవనకళ్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా కార్పొరేషన అభివృద్ధి కోసం పని చేస్తానని ఆయన వివరించారు. కర్నూలు నగరం 44వ వార్డు టీడీపీ ఇనచార్జి భీమిశెట్టి మనోజ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ ఇండసి్ట్రయల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన లిమిటెడ్‌ (ఏపీఐడీసీఎల్‌) డైరెక్టరుగా నియమించారు. 8 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న ఈయన 2021 నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఫ ఆదోనిలో ‘ఆరేకల్లు’కు అవకాశం

ఆదోని నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్‌ నాయకుడు బి.కృష్ణయ్య అలియాస్‌ ఆరేకల్లు రామకృష్ణకు స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన డైరెక్టరు పదవి దక్కింది. టీడీపీ ఆవిర్భావం నుంచి రామకృష్ణ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడులకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. కీలకమైన హౌసింగ్‌ కార్పొరేషనలో డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వడంపై ఆయన ప్రభుత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 04 , 2025 | 12:37 AM