Share News

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - May 21 , 2025 | 12:20 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్‌ సంస్థలకు కార్మికులను ఉద్యోగులను బాని సలుగా చేసే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, సంజీవ నాయుడు వెంకటేశ్వర్లు, మధుశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
బేతంచెర్లలోని పాతబస్టాండులో నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు

బేతంచెర్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్‌ సంస్థలకు కార్మికులను ఉద్యోగులను బాని సలుగా చేసే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, సంజీవ నాయుడు వెంకటేశ్వర్లు, మధుశేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైల్వేస్టేషన ఆవరణం నుంచి పాతబస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ పట్టణ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగనవాడీ, భవన నిర్మాణ కా ర్మిక సంఘం, మోటార్‌ వర్కర్స్‌ యూనియన నాయకులు పాల్గొన్నారు.

డోన పాతబస్టాండు గాంధీచౌక్‌లో..

డోన టౌన: కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చడం తగదని వెంటనే కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దుచేయాలని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు అన్వర్‌, అబ్బాస్‌, ప్రధాన కార్యదర్శి సుంకయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక పాతబస్టాండు గాంధీచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం తగదని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగ, కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ హామాలీ యూనియన నాయకులు కృష్ణ, ఆటో యూనియన నాయకులు మస్తాన పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో:

కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పరిరక్షించాలని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకర ణ ఆపాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బేతంచెర్ల సర్కిల్‌లో నిరసన కా ర్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి టి.శివరాం, మండల కార్యదర్శి ఏవీ భాస్కర్‌ రెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు బి.నాగమద్దయ్య, సీఐటీయూ ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్‌ఏ చిన్న రెహిమాన, ఆదినారాయణరెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, చంద్ర, లక్ష్మన్న, మద్దయ్య, అన్వేష్‌, నాగేశ్వరరావు, బాలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:20 AM