Share News

Visakhapatnam: విశాఖలో డబ్ల్యూటీసీకి నేడు శంకుస్థాపన

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:00 AM

విశాఖపట్నంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు...

Visakhapatnam: విశాఖలో డబ్ల్యూటీసీకి నేడు శంకుస్థాపన

విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్‌ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఎండాడలో పనోరమ హిల్స్‌ వెనుక పది ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసే ఈ ప్రాంతంలో పెద్ద స్టార్‌ హోటల్‌, ఆఫీసు స్పేస్‌తో పాటు కోవర్కింగ్‌ స్పేస్‌ వస్తాయి. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

ఫెనోమ్‌ ఐటీ క్యాంపస్‌కు నేడు శంకుస్థాపన

రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్‌ ఐటీ క్యాంపస్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా గురువారం శంకుస్థాపన జరగనుంది. ఈ కంపెనీకి ఐటీ హిల్‌ నంబరు 2లో 4 ఎకరాలు, మధురవాడలో మరో 0.45 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్థ రూ. 207.5 కోట్లు పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

Updated Date - Nov 13 , 2025 | 06:03 AM