Minister Kondapalli Srinivas: మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:36 AM
మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. చంపావతి నదిపై వంతెన లేక ఇబ్బంది పడుతున్న విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మర్రివలస గ్రామస్థుల సమస్యలపై ‘ఎన్నాళ్లీ కష్టాలు’ శీర్షికన‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో గురువారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి కొండపల్లి ఈ నెల ఒకటిన జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మర్రివలస సమస్యను తీసుకెళ్లామని ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం స్పందించి మర్రివలస గ్రామానికి మినీ వంతెనకు నిధుల కేటాయింపునకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.