Share News

వారణాసిలో దొరికాడు..!

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:58 PM

పట్టణానికి చెందిన ఓ బంగారు వ్యాపారి రూ.30కోట్లతో ఉడాయించాడు. వారణాసిలో ఉన్నాడన్న సమాచారంతో బాధితులు అతడిని నంద్యాలకు తీసుకు వచ్చారు.

వారణాసిలో దొరికాడు..!

రూ.30కోట్లతో ఉడాయించాడు..

బంగారు వ్యాపారిని పట్టుకొచ్చిన బాధితులు

టూటౌన పోలీస్‌స్టేషనలో అప్పగింత

విచారణ చేపట్టిన పోలీసులు

నంద్యాల టౌన, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన ఓ బంగారు వ్యాపారి రూ.30కోట్లతో ఉడాయించాడు. వారణాసిలో ఉన్నాడన్న సమాచారంతో బాధితులు అతడిని నంద్యాలకు తీసుకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని సుంకులమ్మ వీధికి చెందిన శివ (శివ జూవెలర్స్‌ యజమాని) చాలా మంది వద్ద బంగారు ఆభరణాలు చేయిస్తానని డబ్బులు తీసుకొని పది నెలల క్రితం ఉడాయించాడు. బాధితులు విచారణ చేపట్టగా అతడు వారణాసిలో ఉన్నాడని సమాచారం అందించింది. ఈ మేరకు కొంతమంది అక్కడికి వెళ్లి శుక్రవారం అతడిని నంద్యాలకు తీసుకువచ్చారు. గతంలో కూడా శివ మీద రెండో పట్టణ పోలీస్‌స్టేషనలో చీటింగ్‌ కేసు నమోదైంది. దీంతో అతడిని అక్కడ అప్పగించారు. చీటీలు, బంగారు అభరణాలు చేయిస్తానని చాలా మంది వద్ద తీసుకున్నాడు. పదేళ్ల నుంచి దుకాణం నడుపుతుండడంతో బాధితులు నమ్మి డబ్బులు ఇచ్చారు. శివ టూటౌనలో ఉన్నాడని తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని అతనిపై ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఒక బంగారు దుకాణం యజమానికి కూడా కేజీ బంగారం వరకు లావాదేవీల్లో ఇవ్వాలని ఉన్నట్లు సమాచారం. ఇలా చాలా మంది బంగారు దుకాణాల వ్యాపారులను సైతం మోసం చేసినట్లు తెలిసింది. వారంతా వనటౌన పోలీసు స్టేష నలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. బాధితులు నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 11:58 PM