Nimmagadda Ramesh Kumar: రాష్ట్ర అతిథులుగా మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:15 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పని చేసిన వారందరినీ రాష్ట్ర అతిథులుగా ప్రభుత్వం కొనసాగించనుంది.
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పని చేసిన వారందరినీ రాష్ట్ర అతిథులుగా ప్రభుత్వం కొనసాగించనుంది. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పని చేసిన వారందరూ రాష్ట్ర అతిథులుగానే పరిగణిస్తుంది. ఈ ప్రొటోకాల్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎస్ కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.