Former RDO Murali: మదనపల్లె ఫైల్స్ కేసులో మాజీ ఆర్డీవో మురళి అరెస్టు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:47 AM
మదనపల్లె ఫైల్స్ కేసులో మాజీ ఆర్డీవో మురళీని సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్‌ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో...
సుప్రీం కోర్టు బెయిల్ రద్దుతో అదుపులోకి తీసుకున్న సీఐడీ
చిత్తూరు కోర్టులో హాజరు.. 3 వరకు రిమాండ్
తిరుపతి(నేరవిభాగం)/చిత్తూరు లీగల్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘మదనపల్లె ఫైల్స్’ కేసులో మాజీ ఆర్డీవో మురళీని సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్‌ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తిరుపతిలోని ఇంట్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిత్తూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరచగా, వచ్చేనెల 3వ తేదీవరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి బాబాజాన్ ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు మురళిని చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గతేడాది జూలై 21వ తేది రాత్రి మంటలు చెలరేగి డాక్యుమెంట్లు కాలిపోయిన విషయం తెలిసిందే.