Amalapuram: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి మృతి
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:57 AM
మాజీ ఎంపీ, ఏఐసీసీ సీనియర్ నేత కుసుమ కృష్ణమూర్తి(85) శనివారం ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించారు.
నేడు అమలాపురానికి భౌతికకాయం రాక
అమలాపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ఏఐసీసీ సీనియర్ నేత కుసుమ కృష్ణమూర్తి(85) శనివారం ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం అమలాపురం తీసుకురానున్నారు. 1977-80, 1980-84, 1989-1991లలో అమలాపురం ఎంపీగా ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ కన్వీనర్, ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా కృష్ణమూర్తికి మంచి పేరుంది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.