Share News

అసత్యాలను వండివార్చడమే వైసీపీ పని: అశోక్‌బాబు

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:25 AM

వైసీపీ అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. జగన్‌ పత్రికలో 15 ఏళ్లలో చంద్రబాబు ఒక్క వైద్య కళాశాల కూడా తేలేదని అసత్యాలు వండి...

అసత్యాలను వండివార్చడమే వైసీపీ పని: అశోక్‌బాబు

అమరావతి, న్యూఢిల్లీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. జగన్‌ పత్రికలో 15 ఏళ్లలో చంద్రబాబు ఒక్క వైద్య కళాశాల కూడా తేలేదని అసత్యాలు వండి వార్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం దారుణం’ అని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 27 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారని, విభజన తర్వాత కూడా 2014-19లో 11 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదని చెప్పారు.

Updated Date - Sep 09 , 2025 | 06:25 AM