రెండు మూడేళ్లలో అమరావతిలో పులసలు పడతాం: కేతిరెడ్డి
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:48 AM
రెండు మూడేళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాం. మీ అందరికీ పంచిపెడతాం. ఇక్కడ గోదావరి పొంగినట్టు అక్కడ వరద పొంగుతోంది అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే...
మేం దమ్మున్నోళ్లం... మాది దమ్మున్న పార్టీ: అనంత
రాజమహేంద్రవరం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘రెండు మూడేళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాం. మీ అందరికీ పంచిపెడతాం. ఇక్కడ గోదావరి పొంగినట్టు అక్కడ వరద పొంగుతోంది’ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సుగాసి బాలసుబ్రహ్మణ్యం ములాఖత్‌లో కలిశారు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అమరావతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ‘మేం దమ్మున్న వాళ్లం. మా పార్టీ దమ్మున్న పార్టీ. అన్ని ఎన్నికలు పెడితే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.