నెలాఖరులోపు జగన్ జైలుకు: గోనె
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:04 AM
మద్యం కుంభకోణం జగన్‌రెడ్డి మెడకు చుట్టేసుకుంది. జగన్ సెప్టెంబరు నెలాఖరులోపు అరెస్టవడం పక్కా అని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ నేత గోనె ప్రకాశరావు అన్నారు.
తిరుపతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ‘మద్యం కుంభకోణం జగన్‌రెడ్డి మెడకు చుట్టేసుకుంది. జగన్ సెప్టెంబరు నెలాఖరులోపు అరెస్టవడం పక్కా’ అని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ నేత గోనె ప్రకాశరావు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. జగన్ అరెస్టు కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉండ దు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ వందలకోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి’’ అని కూటమి నేతలను డిమాండ్ చేశారు. ఇక, ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాల్సిన జగన్ ఎన్డీఏ వైపు ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘అటూ, ఇటూ కానివాళ్ల’లాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.