Share News

Police Interrogation: ఆరు గంటలపాటు సీదిరి విచారణ

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:14 AM

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు గురువారం సాయంత్రం 3.45 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకూ...

Police Interrogation: ఆరు గంటలపాటు సీదిరి విచారణ

  • మాజీ మంత్రిపై పది కేసులు నమోదు

పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు గురువారం సాయంత్రం 3.45 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకూ ఆరు గంటల పాటు విచారించారు. ఆయనపై పది కేసులు నమోదయ్యాయి. చివరిగా 30 పోలీసు యాక్ట్‌ను ఉల్లంఘించి సమావేశం నిర్వహణ, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలు, మహిళా కానిస్టేబుల్‌పై దాడి కేసుల్లో ఆయన నిందితుడిగా ఉండడంతో గురువారం విచారించారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ మొత్తం 12 కేసులు ఎదుర్కొంటున్నానని తెలిపారు.

Updated Date - Nov 14 , 2025 | 06:14 AM