Machilipatnam Police Station: పేర్ని నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:55 AM
మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. శుక్రవారం మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో సిఐ ఏసుబాబుపై...
మచిలీపట్నం క్రైమ్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. శుక్రవారం మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో సిఐ ఏసుబాబుపై దౌర్జన్య చేసి విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్ నంబరు 186/2025 కింద కేసు నమోదు చేసి 132, 351(2), రెడ్‌విత్ 3(5), బీఎన్‌ఎస్ సెక్షన్లను జత చేశారు. పేర్ని వెంకట్రామయ్య (నాని)తో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేసినట్లు చిలకలపూడి పోలీసులు వివరించారు. ఘటనపై వెంటనే స్పందించిన ఎస్‌పీ విద్యాసాగర్ నాయుడు ఇటువంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదైనట్లు తెలుస్తోంది.