Share News

ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:46 AM

ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. దీనికి కచ్చితంగా ప్రతిఫలం తీసుకోక తప్పదు. మిథున్‌రెడ్డి ఆరోగ్యంగా, ధైర్యంగానే ఉన్నాడు.

ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

రాజమహేంద్రవరం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. దీనికి కచ్చితంగా ప్రతిఫలం తీసుకోక తప్పదు. మిథున్‌రెడ్డి ఆరోగ్యంగా, ధైర్యంగానే ఉన్నాడు. మాకైతే పశ్చాత్తాపం లేదు’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మద్యం స్కాం కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆయన తండ్రి రామచంద్రారెడ్డి, ఎస్వీ యూ మాజీ వీసీ రాజారెడ్డి, విఠల్‌రెడ్డి శుక్రవారం ములాఖత్‌ ద్వారా కలిశారు. అనంతరం రామచంద్రారెడ్డి జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత కక్ష సాధింపునకు దిగజారిందో చూడొచ్చన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 05:46 AM