Share News

Illegal Activities: అరాచకాల జోగి

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:39 AM

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. అక్రమాలకు పాల్పడ్డారు. వివాదాస్పదంగా వ్యవహరించారు. అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా నుంచి ఇప్పుడు నకిలీ మద్యం వరకు ఆయనపై ఆరోపణలున్నాయి

Illegal Activities: అరాచకాల జోగి

  • ఎన్నో వివాదాలు, అవినీతి ఆరోపణలు

  • నాడు చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం

  • ఆ తర్వాత కానుకగా మంత్రి పదవి

  • గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా

  • అధికారం పోయాక అక్రమాలు బయటకు

  • రెవెన్యూ-సీఐడీ జాయింట్‌ సర్వేలోనూ

  • భూముల కబ్జాపర్వం నిర్ధారణ

  • తాజాగా నకిలీ మద్యం కేసులో అరెస్ట్‌

  • అద్దేపల్లి జనార్దనరావుతో కలిసి తయారీ

  • కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు కుట్ర

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. అక్రమాలకు పాల్పడ్డారు. వివాదాస్పదంగా వ్యవహరించారు. అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా నుంచి ఇప్పుడు నకిలీ మద్యం వరకు ఆయనపై ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులు టీడీపీ ప్రధాన కార్యాలయంపైన, గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడులకు పాల్పడిన క్రమంలో జోగి రమేశ్‌ ఏకంగా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఉదంతంతో ఒక్కసారి గా వార ్తల్లో నిలిచారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్‌ ప్రాపకంతో మంత్రి అయ్యారు. అధికారం కోల్పోయాక నాటి అక్రమాలన్నీ వెలుగులోకి రావటంతో ఇప్పుడు జోగి రమేశ్‌ మెడకు చుట్టుకుంటున్నాయి.

చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం

గత ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడితో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడికి వైసీపీ నేతలు పథక రచన చేసి అమలు చేశారు. నాడు పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్‌ ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు ఇంటిపైనే దాడికి ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు బలంగా ప్రతిఘటించడంతో ఆయన ప్రయత్నం ఫలించలేదు. జోగి రమేశ్‌ చేసిన ఈ పనికి ప్రతిఫలంగా వైసీపీ అధినేత జగన్‌ ఆయనకు రాష్ట్ర మంత్రి పదవిని కట్టబెట్టారు.


మంత్రి పదవి వచ్చాక జోగి టీడీపీపై ఒంటికాలిపై లేస్తూ వివాదాలకు ఆజ్యం పోసేవారు. అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేశ్‌ అగ్రిగోల్డ్‌ భూ ముల కబ్జాకు పాల్పడ్డారు. గతేడాది జనవ రి 20న విజయవాడ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ, విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌కు ఒక లేఖ వచ్చింది. ‘అగ్రిగోల్డ్‌కు చెందిన అవ్వా వెంకట నారాయణరావు అనే వ్యక్తి అంబాపురం గ్రామంలోని రీ సర్వే నంబర్‌ 69/2, 87లో భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ కట్టి బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నిర్వహించి సరిహద్దులు నిర్ణయించండి’ అని కోరా రు. దీనిపై తహసీల్దార్‌ విచారణ జరిపి ఎస్‌ఐకు నివేదికను అందజేశారు. ‘అంబాపురం గ్రామంలో సర్వే నంబర్‌ 88లో పోలవరపు మురళీమోహన్‌కు చెందిన ఎకరం భూమిని ప్లాట్లుగా విభజించి గతంలోనే విక్రయించారు. అదే సర్వే నంబర్‌లోని భూమి ని జోగి రమేశ్‌ కుమారుడు జోగి రాజీవ్‌, సోదరుడు జోగి వెంకటేశ్వరరావుకు విక్రయించారు. రీసర్వే నం బర్‌ 87లో ఖాళీగా ఉన్న భూమిని గ్రామ సర్వేయర్‌ నివేదిక మేరకు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి భూమి స్వాధీన ఉత్తర్వులను పొంది, సర్వేనంబర్‌ 88 స్థానంలో 87గా సవరణ చేయించుకున్నారు. ఆ భూమి ఈడీ అటాచ్‌మెంట్‌ చేసిన అగ్రిగోల్డ్‌కు చెందినది’ అని నివేదికలో పేర్కొన్నారు. దీంతో జోగి రమే శ్‌ వ్యవహారం వెలుగు చూసింది.


ఈ భూలావాదేవీలకు 2023లోనే అడుగులు పడ్డాయి. అగ్రిగోల్డ్‌ భూములని తెలిసే జోగి రమేశ్‌ ఉద్దేశపూర్వకంగా పోలవరపు మురళీమోహన్‌ దగ్గర భూములు కొన్నట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రిజిస్ర్టేషన్‌ చేసిన విజయవాడ రూరల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ సింగ్‌ ఆ తర్వాత మరో నకిలీ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో చిక్కుకుని పరారీ అయ్యా రు. పోలవరపు మురళీమోహన్‌ కూడా తాను ఆ భూములను విక్రయించలేదని, తనకేమీ సంబంధం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు లో ఏసీబీ పోలీసులు జోగి రాజీవ్‌, జోగి వెంకటేశ్వరరావును అరెస్టు చేయగా, బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కొద్దినెలల కిందట సీఐడీ, రెవెన్యూ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. వివాదాస్పద భూమిని సర్వే చేయగా, సర్వే నంబర్‌ 69/2, 87లో భాగమై ఉన్నాయని, ఇవి అటాచ్‌మెంట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ భూములేనని తేల్చారు. అగ్రిగోల్డ్‌ గ్రూపునకు చెందిన ఈ భూములు వాస్తవంగా ఎవరి పేరుతో ఉన్నాయో కూడా జాబితాను పొందుపరిచారు.


నకిలీ మద్యం కేసులో కర్త, కమ్మ

నకిలీ మద్యం తయారీలో కర్త, కర్మ జోగి రమేశ్‌ అని నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు చెప్పటంతో ఈ కేసులో ఆయన చిక్కుకున్నారు. అద్దేపల్లి జనార్దనరావు ఎవరో తనకు తెలియదని మొదట్లో జోగి బుకాయించారు. అద్దేపల్లి ఆయన ఇంటికి రావటం, గంటపాటు ఉండటం, గతంలో పలు ఫంక్షన్లలో వీరిద్దరూ కలిసి ఉండటం వంటివి బయటకు వచ్చాయి. అయితే జోగితో అద్దేపల్లికి ఉ న్న బంధాలు పోలీసు విచారణలో బయటపడ్డాయి.

డాక్యుమెంట్లు, కారు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌ , ఫోన్ల స్వాధీనం

మరోవైపు.. సిట్‌, ఎక్సైజ్‌ బృందాలు మధ్యా హ్నం 12 గంటల ప్రాంతం నుంచి రాత్రి 8 గంటల వరకు జోగి రమేశ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన కారు, రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఎన్‌వీఆర్‌ హార్డ్‌డిస్క్‌, వైఫై రూటర్‌ను, ఆయన భార్య ఫోన్‌, జోగి సోదరుడు రాము ఫోన్‌ను కూడా సీజ్‌చేశారు.

Updated Date - Nov 03 , 2025 | 05:42 AM