Share News

Assembly Facilities Committee: మాజీ శాసనసభ్యుల పెన్షన్లు పెంచాలి 30 నుంచి 50 వేలకు

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:48 AM

మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని స్పీకర్‌ ఆధ్వర్యంలోని ఏపీ శాసనవ్యవస్థ సదుపాయాల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Assembly Facilities Committee: మాజీ శాసనసభ్యుల పెన్షన్లు పెంచాలి 30 నుంచి 50 వేలకు

  • అసెంబ్లీకి సదుపాయాల కమిటీ సిఫారసు

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని స్పీకర్‌ ఆధ్వర్యంలోని ఏపీ శాసనవ్యవస్థ సదుపాయాల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు కమిటీ తొలి నివేదికను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం అసెంబ్లీకి సమర్పించారు. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల సదుపాయాలపై మూడు సిఫారసులు చేసినట్లు తెలిపారు. సభ్యుల జీతభత్యాలను 2016లో చివరిసారిగా సవరించారని, మారిన పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో వాటిని హేతుబద్ధం చేయాలని సిఫారసు చేసింది. సదుపాయాల కమిటీ సిఫారసులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫారసులను ప్రభుత్వానికి పంపుతామని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

Updated Date - Sep 28 , 2025 | 05:48 AM