RTI Commissioner: ఆర్టీఐ కమిషనర్‌గా మాజీ పాత్రికేయుడు వీఎస్‌కే చక్రవర్తి..
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:41 AM
సమాచార హక్కు కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రధాన సమాచార కమిషనర్‌గా న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు నియామకాన్ని ఖరారు చేసిన...
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రధాన సమాచార కమిషనర్‌గా న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు నియామకాన్ని ఖరారు చేసిన సీఎం మరో నలుగురు కమిషనర్ల నియామకాన్ని కూడా ఖరారు చేశారు. ఇప్పటికే రవియాదవ్, ఆదెన్న, పీఎస్ నాయుడు పేర్లు ఖరారు కాగా తాజాగా మాజీ పాత్రికేయుడు వీఎ్‌సకే చక్రవర్తిని మరో కమిషనర్‌గా ఖరారు చేశారు. వీరిలో రవియాదవ్, ఆదెన్న, పీఎస్ నాయుడు న్యాయవాదులు. ప్రస్తుతానికి ఒక ప్రధాన కమిషనర్, నలుగురు కమిషనర్లతో నియామక ప్రక్రియను ముగించారు. సీఎం నేతృత్వంలోని సెలక్ట్ కమిటీ ఇప్పటికే వీరి పేర్లను ఖరా రు చేయగా, ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం జీఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) వద్ద ఉంది. జీఏడీ నుంచి గవర్నర్‌కు ఫైలు వెళుతుంది. గవర్నర్ ఆమోదం తర్వాత జీవో విడుదల చేస్తారు.